Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Edo Teliyani
S.P.Balasubramanyam & S.P.Sailaja
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది ఎదలో ఒదిగే రాగమిది ఈ ఈ
ఏదో తెలియని బంధమిది ఎదలో ఒదిగే రాగమిది ఈ ఈ
ఏదో తెలియని బంధమిది
పూజకు నోచని పువ్వును కోరి వలచిన స్వామివి నువ్వేలే
రూపం లేని అనురాగానికి ఊపిరి నీ చిరు నవ్వేలే
కోవెల లేనీ
కోవెల లేని దేవుడవు గుండెల గుడిలో వెలిశావు ఊ
పలికే జీవన సంగీతానికి వలపుల స్వరమై ఒదిగావు
తనువూ మనసూ ఇక నీవే
ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది ఈ ఈ
ఏదో తెలియని బంధమిది
వేసవి దారుల వేసటిలోన వెన్నెల తోడై కలిశావు
పూచే మల్లెల తీగకు నేడు పందిరి నీవై నిలిచావు
ఆశలు రాలే ఏ ఏ
ఆశలు రాలే శిశిరంలో ఓ ఆమని నీవై వెలిశావు ఊ
ఆలుమగల అద్వైతానికి అర్థం నీవై నిలిచావు
తనువూ మనసూ ఇక నీవే ఏ ఏ
ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది ఈ ఈ
ఏదో తెలియని బంధమిది
హా ఆ