Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Prema Swaramulalo
Hriday Gattani
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ స్వరములలో దైవ స్మరణములే
అని తెలిసింది తొలిసారి
నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
కోకిలసలు కోరుకోనని
ప్రేమ తపస్సు మనదిలే
అతిధులెవరు ఎదురుపడని
ప్రేమ తిధులు మనవే
అమృతములు ఎగసి పడిన
ప్రేమ నదులు మనవే
చరితల కాగితాల లోన
చదవలేని ప్రేమనే
నీలో చదివా ఈ క్షణాలలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
హృదయ గళము పాడుతున్న
ప్రేమ గీతి మనదిలే
కనుల కలము రాసుకున్న
ప్రేమలేఖ మనదే
పెదవి ప్రమిద పంచుతున్న
ప్రేమ జ్యోతి మనదే
మనుషుల ఊహలోన సైతం
ఉండలేని ప్రేమతో
ఎదుటే ఉన్నా ఈ క్షణాలలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
అని తెలిసింది తొలిసారి
నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే
ప్రేమ స్వరములలో దైవ స్మరణములే
అని తెలిసింది తొలిసారి
నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే దైవ దర్శనమే