Medante Medakaadhu
S P Balasubramaniam
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
మేడంటే మేడా కాదు
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది
పొదరిల్లు మాది
నేనైతే ఆకు కొమ్మా
తానైతే వెన్నెల వెల్లా
నేనైతే ఆకు కొమ్మా
తానైతే వెన్నెల వెల్లా
పదిలంగా నేసిన పూసిన
పొదరిల్లు మాది
మేడంటే మేడా కాదు
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది
పొదరిల్లు మాది
కోవెల్లో వెలిగే దీపం
దేవి మా తల్లి
కోవెల్లో తిరిగే పాటల
గువ్వా నా చెల్లి
గువ్వంటే గువ్వా కాదు గొరవంకగాని
వంకంటే వంకా కాదు నెలవంకగాని
మేడంటే మేడా కాదు
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది
పొదరిల్లు మాది
గోరింక పెళ్లైపొతే ఏ వంకో వెళ్లీపొతే
గోరింక పెళ్లైపొతే ఏ వంకో వెళ్లీపొతే
గూడంతా గుబులై పోదా
గుండెల్లో దిగులై పోదా
మేడంటే మేడా కాదు
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది
పొదరిల్లు మాది
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది
పొదరిల్లు మాది