Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Eenatiki
Kausalya
,
Raghu Kunche
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఏనాటికి మనమొకటేనని
ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని
తెలిసిందిలే కలగన్నామని
కన్నీరు జోరైయింది, ఆ నీరు ఏరయ్యింది
నువు లేక సంతోషమా
వాకిట్లో వాసంతాలు, ఆ నాటి సాయంత్రాలు
నువు లేక శూన్యం సుమా
నాతోనే నువు ఉంటానని
ఆ రోజే నువు అన్నావని
ఎలా నేను మరిచేది ఓ నేస్తమా
ఏనాటికి మనమొకటేనని
ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని
తెలిసిందిలే కలగన్నామని
నీ కోసమే మిగిలున్నానిలా
నువు రాక నేనింక ఎనాళ్ళిలా
నా గుండెలో నీ ఆలోచన
నా కంటి పాపల్లో ఆవేదన
ఇది మౌన రాగల సంకీర్తన
ఇలా చూడు ఏ వైపు అడుగేసినా
నీలోనే సగమున్నానని
నీ కోసం మిగిలున్నానని
ఏలా నీకు తెలిపేది ఓ నేస్తమా
ఏనాటికి మనమొకటేనని
ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని
తెలిసిందిలే కలగన్నామని
మరుపన్నది ఇటు రాదే ఎలా
నా మనసుకేమైంది లోలోపల
వలపన్నది చెలరేగే అలా
ఎదలోన దాగుండిపోదే ఎలా
జడివానలా వచ్చి తడిపేయ్యవా
ప్రియా అంటూ ప్రేమారా పిలిచెయ్యవా
నీ వైపే ఎద లాగిందని
నీ చూపే అది కోరిందని
చెలి నీకు తెలిసాక చెలగాటమా
ఏనాటికి మనమొకటేనని
ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని
తెలిసిందిలే కలగన్నామని
కన్నీరు జోరైయింది, ఆ నీరు ఏరయ్యింది
నువు లేక సంతోషమా
వాకిట్లో వాసంతాలు, ఆ నాటి సాయంత్రాలు
నువు లేక శూన్యం సుమా
నాతోనే నువు ఉంటానని
ఆ రోజే నువు అన్నావని
ఎలా నేను మరిచేది ఓ నేస్తమా