Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Elaagavachi
S.P. Balasubrahmanyam, P. Susheela, K. V. Mahadevan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఇలాగ వచ్చి అలాగ తెచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి
నా మెడ నిండా వేశావు నన్నో మనిషిని చేశావు
ఎలాగా తీరాలి నీ ఋణమెలాగ తీరాలి
ఎలాగా తీరాలి నీ ఋణమెలాగ తీరాలి
తీరాలంటే దారులు లేవా కడలి కూడా తీరం లేదా
అడిగినవన్నీ ఇవ్వాలీ అడిగినప్పుడే ఇవ్వాలీ
అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలి
అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలి
అడిగినప్పుడే వరమిస్తారు ఆకాశంలో దేవతలు
అడిగినప్పుడే వరమిస్తారు ఆకాశంలో దేవతలు
అడగముందే అన్నీ ఇచ్చే నిన్నే పేరున పిలవాలీ నిన్నే తీరున కొలవాలీ
అసలు పేరుతో నను పిలవద్దు అసలు కన్నా వడ్డీ ముద్దు
ముద్దు ముద్దుగా ముచ్చట తీర పిలవాలీ నను కొలవాలీ
అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలీ
అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలీ
కన్నులకెన్నడూ కనగరానిది కానుకగా నేనడిగేదీ
కన్నులకెన్నడూ కనగరానిది కానుకగా నేనడిగేదీ
అరుదైనది నీవడిగేది అది నిరుపేదకెలా దొరికేది
ఈ నిరుపేదకెలా దొరికేది
నీలో ఉన్నది నీకే తెలియదు నీ మనసే నే కోరుకున్నది
అది నీకెపుడో ఇచ్చేశానే నీ మదిలో అది చేరుకున్నదీ ఇంకేం
ఇలాగ తీరిందీ మన ఋణమిలాగ తీరింది
ఇలాగ తీరిందీ మన ఋణమిలాగ తీరింది
సాహిత్యం: శ్రీ శ్రీ