Adbhutam
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
కళ్ళలో దాగి ఉన్న కలలు ఓ అద్భుతం
నా కలలనే నిజము చేసే నువ్వు ఓ అద్భుతం
పరిపరి తలిచేలా నీ పరిచయం అద్భుతం
పడిపడి చదివేలా నీ మనసు నా పుస్తకం
పదహారు ప్రాయంలోన పరువాల ప్రణయంలోన
హృదయాలను కలిపేసే పండగే అద్భుతం
ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే
ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతం
ఇలా నావెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే
ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతం
ఇలా నావెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే
కిరణం తోరణంలా సిరులే కురియువేళ
తలపే వామనంలా వలపే గెలుచువేళ
ప్రియుడిని చూసి ప్రేయసి పూసే
బుగ్గన సిగ్గే ఎంతో అద్భుతం
ఆరారు రుతువులు అన్ని తమ ఇల్లే ఎక్కడ అంటే
మన అడుగులనే చూపే సంబరం అద్భుతం
ఏవేవో సంగీతాలు ఎన్నెన్నో సంతోషాలు
ఆరారు ఋతువులు అన్నీ తమ ఇల్లే ఎక్కడ అంటే
మన అడుగుల్నే చూపే సంబరం అద్భుతం
ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే
ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతం
ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే
ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతం
ఇలా నావెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే
ఇలా నావెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే