Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Prathi Yedhalo
Sona Mohapatra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ప్రతి ఎదలో కలుగునుగా
ఈ కథలోనూ జరిగెనుగా
హా ప్రతి ఎదలో కలుగునుగా
ఈ కథలోనూ జరిగెనుగా
తొలకరిలా కురిసెనుగా
మనసులనే తడిపెనుగా
ప్రేమేక్షణమైనా చిగురులు వేస్తుంది
నడిచే దారుల్లో తోడై వస్తుంది
గమ్యం లేని గమనం ప్రేమా
వెతికిన లేదే తన చిరునామా
తుది మొదలేదో తెలియని ప్రేమా
ముగిసి పోని సమరం ప్రేమా
ఇది వరకెపుడూ ఎరుగనిదేదో
ఏదో మాయే జరిగే జరిగే
గుండెలో ఏదో సందడి లోలో
ఇంతగా ఎపుడూ లేనేలేదే
ప్రతి ఎదలో కలుగునుగా
ఈ కథలోనూ జరిగెనుగా
గరిగ సగరిగ సరినిసదనిదమప
గగరిగ మగనిసనిసని
గరిగ దప మగరిస నిస నిదపమప
పససా నిసరిగసరిగ సరిగ నిసస
ఓ అనుకోకుండా అలికిడి మొదలై
అలుపే లేని అలజడి రేగే
నిన్నా మొన్నా ఎవరికి ఎవరో
చూస్తూ చూస్తూనే ఒకరికి ఒకరు
లోకం ఇపుడే లౌక్యం నేర్చే
తెలియక సతమతమై పోతుందిలా
కాలం ఇపుడే కావ్యం రాసే
చరితలో నిలిచే కథనే మలిచే
ప్రతి ఎదలో కలుగునుగా
ఈ కథలోనూ జరిగెనుగా