Skip to content

Anuvu Anuvuna

S.P. Balasubrahmanyam, Aswathama
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

అణువు అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపించరావా అణువును అణువున వెలసిన దేవా మనిషిని మనిషే కరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ నిప్పుని మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికి అమరజీవులై వెలిగిన మూర్తుల ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... అమరజీవులై వెలిగిన మూర్తుల అమృతగుణం మాకందించ రావా అమృతగుణం మాకందించ రావా అణువును అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపించ రావా అణువును అణువున వెలసిన దేవా జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృ భూమి మొరపెట్టిన వేళ స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర్య ఫలమును సాధించి ధన్య చరితులై వెలిగిన మూర్తుల ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ధన్య చరితులై వెలిగిన మూర్తుల త్యాగ నిరతి మా కందించ రావా త్యాగ నిరతి మా కందించ రావా అణువు అణువున వెలసిన దేవా కను వెలుగై నడిపించ రావా అణువు అణువున వెలసిన దేవా వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు చాచే వేళ గుండెకు బదులుగ గుండెను పొదిగీ కొన ఊపిరులకు ఊపిరిలూదీ జీవన దాతలై వెలిగిన మూర్తుల ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... జీవన దాతలై వెలిగిన మూర్తుల సేవాగుణం మాకందించ రావా సేవా గుణం మాకందించ రావా అణువు అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపించరావా అణువు అణువున వెలసిన దేవా