Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nuvu Choodu Chudakapo
M.M.Keeravani
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నువ్వు చూడు చూడకపో
నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా
మాటాడు ఆడకపో, మాటాడుతునే ఉంటా
ప్రేమించు మించకపో, ప్రేమిస్తూనే ఉంటా
నా ప్రాణం నా ధ్యానం నువ్వేలెమ్మంట
నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా
నువ్వు తిట్టినా, నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా
నువ్వు కొట్టినా, నా చెంప మీద నీ గురుతొకటుందని సంతోషిస్తా
మనసు పువ్వును అందించాను, కొప్పులో నిలుపుకుంటావో, కాలికింద నలిపేస్తావో
వలపు గువ్వను పంపించాను, బొట్టు పెట్టి రమ్మంటావో, గొంతు పట్టి గెంటేస్తావో
ఏం చేసినా, ఎవరాపినా, చేసేది చేస్తుంటా
నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా
మాటాడు ఆడకపో, మాటాడుతునే ఉంటా
పూజించటం పూజారి వంతు, వరమివ్వడమన్నది దేవత ఇష్టం
ప్రేమించటం ప్రేమికుడి వంతు, కరుణించడమన్నది ప్రేయసి ఇష్టం
ఎందువల్ల నిను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదుగా, నిన్ను మరవడం జరగదుగా
ఎందువల్ల నువు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా, ఎదురు చూపులే ఆపనుగా
ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా
నిను చూడలని ఉన్నా
నిను చూడలని ఉన్నా, నే చూడలేకున్నా
మాటాడాలని ఉన్నా, మాటాడలేకున్నా
ప్రేమించాలని ఉన్నా, ప్రేమించలేకున్నా
లోలోన నాలోన కన్నీరవుతున్నా