Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Manishi Maara Ledhu
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
వేషము మార్చెను హోయ్
భాషను మార్చెను హోయ్
మోసము నేర్చెను అసలు తానే మారెను
అయినా మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు
మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు
క్రూరమృగమ్ముల కోరలు తీసెను ఘోరారణ్యములాక్రమించెను
క్రూరమృగమ్ముల కోరలు తీసెను ఘోరారణ్యములాక్రమించెను
హిమాలయముపై జండా పాతెను
హిమాలయముపై జండా పాతెను ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు ఆతని కాంక్ష తీరలేదు
పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను
పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను వాదము చేసెను
వేదికలెక్కెను వాదము చేసెను త్యాగమె మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదు ఆతని బాధ తీరలేదు
వేషమూ మార్చెను భాషనూ మార్చెను
మోసము నేర్చెను తలలే మార్చెను
అయినా మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు
ఆ...
ఆహహాహాహ ఆహాహహా...
ఓ...
ఓహొహోహోహో ఓహోహొహో...