Skip to content

Manasuna Unnadi (Male)

Shivashankar, S. P. Balasubrahmanyam
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

మనసున ఉన్నది చెప్పేది కాదని మాటున దాచేదెల మనదనుకున్నది చేజరిందని నమ్మకపోతే ఎలా మరి మరి తలచి ఊహలలోనే దాచి చాటుగా చూసేదెల తగదని తెలిసి తలపే ఆపలేని తప్పును చేసేదెలా ఇకనైనా చెరగాలి నల్లని నీడల నను వెంటాడే కల మనసున వున్నది చెప్పేది కాదని మాటున దాచేదెల నేల కందించి ఆకాశ గంగని నింగి గుండెల్లో నలుపు కడగని కురిసే చల్లని వాన జల్లుతో కళ్ల ముందున్న సత్యాన్ని చూపని రెప్ప చాటున్న నిదుర కరగని ఊబికే వెచ్చని కన్నీళ్ళతో అందిస్తున్న నా ప్రియమైన నీకు అక్షింతలు గా నా ప్రతి ఆశనే కలకాలం నీ నవ్వే నిను నడిపించని నను వెంటాడే కల మనసున వున్నది చెప్పేది కాదని మాటున దాచేదెల నన్ను రమ్మన్నా చెలిమి వెన్నెల దాటి రానంది చీకటి కాపలా ఇకపై తెరలను తీసేదెల నిన్ను నిన్నల్లో ఆపిన నిజమిల జ్ఞాపకాలతో అల్లింది సంకెల గతమే సిలువగ మోసేదెల ఇచ్చేస్తున్నా నా ప్రియమైన నీకు నీకై వెతికినా నా ప్రతి శ్వాసనే నిను చేరి సిగా పూవై కొలువై ఉండని నను వెంటాడే కల మనసున వున్నది చెప్పేది కాదని మాటున దాచేదెల మనదనుకున్నది చేజరిందని నమ్మకపోతే ఎలా మరి మరి తలచి ఊహాలలోనే దాచి చాటుగా చూసేదెల ఆ ఆ తగదని తెలిసి తలపే ఆపలేని తప్పును చేసేదెలా ఇకనైనా చెరగాలి నల్లని నీడల నను వెంటాడే కల