Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kannulatho
P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరువరాని తలపులు

రెండు ఏకమై
ఒహొ
ప్రేమే లోకమై
అహా
నా మది పాడే పరాధీనమై
అలాగా
కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరువరాని తలపులు
చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట

దారులకాచి సమయము చూచి దాచిన ప్రేమ దోచెనట
మరలా వచ్చెను మనసే ఇచ్చెను
మరలా వచ్చెను మనసే ఇచ్చెను
అతనే నీవైతే ఆమే నేనట
నిజంగా
ఉం ఉం
కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరువరాని తలపులు
నల్లని మేఘం మెల్లగ రాగ నాట్యము నెమలి చేసినది

వలచినవాడు సరసకు రాగ ఎంతో సిగ్గు వేసినది
తనివితీరా తనలో తానే
తనివితీరా తనలో తానే మనసే మురిసింది పరవశమొందగా
ఐ సీ
కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరువరాని తలపులు
రెండు ఏకమై ప్రేమే లోకమై నా మది పాడే పరాధీనమై
కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరువరాని తలపులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, పెళ్లి కానుక, ఏఎం రాజ, ఏ ఎం రాజ, సుశీల