Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Anaganaga Oka
Chitra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
అనగనగా ఒక నిండు చందమామ
నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా
అంతలోనే తెల్లవారిపోయెనమ్మా
ఆ కన్నె కలువ కల కరిగిపోయెనమ్మా
పచ్చని జంటను విడదీసిన ఆ పాపం ఎవ్వరిది
పచ్చని జంటను విడదీసిన ఆపాపం ఎవ్వరిది
కథ మొదలవగానే కాలం కత్తులు దూసింది
కథ మొదలవగానే కాలం కత్తులు దూసింది
అనగనగ ఒక నిండు చందమామ
నిరు పేద కలువతో చెలిమి చేసెనమ్మా
ఆశలెన్నో విరిసేలా బాసలెన్నో చేసాడు
ఉన్నపాటుగా కన్ను మరుగయే చలువ చంద్రుడు
ఆశలెన్నో విరిసేలా బాసలెన్నో చేసాడు
ఉన్నపాటుగా కన్ను మరుగయే చలువ చంద్రుడు
రేరాజును రాహువు మింగాడో
అమవాస్యకు ఆహుతి అయ్యాడో
రేరాజును రాహువు మింగాడో
అమవాస్యకు ఆహుతి అయ్యాడో
అటు ఇటు వెతుకుతూ నిలువునా రగులుతతూ
వెన్నెల ఉందని వేకువ వద్దని
కలువ జన్మ వడలి పోయెనమ్మ ఓ
అనగనగ ఒక నిండు చందమామ
నిరు పేద కలువతో చెలిమి చేసెనమ్మా
గుప్పెడంత గుండెల్లో ఉప్పెనైన సంద్రంలో
చిక్కుకున్న ఈ చిన్న ఆశకి శ్వాస ఆడదే
దిక్కులన్నీ చూస్తున్నా నింగిని నిలదీస్తున్నా
దిక్కులేని ఈ దిగులు ప్రశ్నకి బదులు దొరకదే
చిరునవ్వులు పూసిన మంట ఇది
కన్నీటిని కోరని కోత ఇది
చిరునవ్వులు పూసిన మంట ఇది
కన్నీటిని కోరని కోత ఇది
ఓటమై ముగిసెనా గెలుపుగా మిగిలెనా
జాబిలి వెన్నెల మాటున రేగిన జ్వాలలాంటి
వింత బ్రతుకు నాది ఆ
కలువని చంద్రుని ఎందుకు కలిపాడు
ఆ కలయిక కలగా ఎందుకు మార్చాడు
ఆ కథ రాసిన దేవుడన్నవాడు
కరుణన్నది ఎరుగని కటిక గుండెవాడు
నా కథలో ఆ దేవుడే ఎంతటి దయ చూపించాడు
అడగక ముందే ఇంతటి పెన్నిధి నాకందించాడు
కలలే తరగని ఈ చంద్రుని నేస్తం చేసాడు
ఎపుడు వాడని ఈ కలువని చెలిగా ఇచ్చాడు