Skip to content

Vevela Gopemmala

S.P. Balasubrahmanyam
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

వే వేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే అహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే అహహ వే వేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడె మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడె కన్న తోడు లేని వాడే కన్నె తోడు వున్నవాడె మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనే మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనే చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే పోతన్న కైతలన్నీ పోతపోసుకున్నాడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే అహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే రాస లీలలాడినాడే రాయబారమేగినాడే గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే వరదయ్య గానాల వరదలై పొంగాడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే అహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే అహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే అహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే అహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే