Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
The Hymn Of Dharma
Battu Vijay Kumar
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
రెహమ్ మేరె ఖుదా
రెహమ్ మేరె ఖుదా
రెహమ్ మేరె ఖుదా
బ్రతకమంటూ బ్రతుకునిచ్చి
బ్రతకనివ్వవు వివరమేంటయ్యా
ఎవరు అడిగే నిన్ను ప్రాణం
ఎందుకిచ్చావ్ జీవి జన్మం
ఘోరమైన విధిని రాసే
క్రూరమైన మనసు నీదయ్యా
తీపి చూపి చేదునిస్తూ
బంధమిచ్చి బాధనిస్తూ
తెగే...!
తెగేనని తెలిసి మనసుల ముడులు వేస్తావా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
వినవా కనవా
ఓ...!
చూడు కథలో మలుపే
తీసే మరణపు తలుపే
కాలమే రాసిన విద్రోహ విష కథనం
నిన్న నవ్విన నవ్వుల వెనక
ఇంత దుఃఖముందా నయవంచకా
కంటిరెప్పంచునా ఏడు సంద్రాలనే
ఉంచి పొంగించొద్దు ఆపెయ్ ఈ ఆటనే
ఎందుకీ శోఖము, అసలెందుకీ శాపము
ప్రాణాలతో చెలగాటము
చూపిక జాలి గుణము
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
వినవా కనవా
ఓ...!
వాన చినుకే పడెనే
దాచి పిడుగుల జడినే
తొలకరే ప్రళయమై
కవలించినది అరెరే
వేడుకుంటున్నా వినవా వ్యధనే
మార్చి రాసేయవా తలరాతనే
నా ఆయుష్షులో సగం తీసేసుకో
ఏదో వరమిచ్చి ప్రాణాన్నే కాచుకో
ఇవ్వడం ఎందుకు?
లాక్కోవడం ఎందుకు?
నిస్వార్ధపు స్నేహాలకు ఈ శిక్షే ఎందుకొరకు??
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
వినవా కనవా
ఓ...!