Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Andani Aakaasam
Saindhavi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అందనీ ఆకాశం దించావయ్యా మాకోసం
కాలాన నీ పేరు నిలిచేనయ్యా
కన్నులా ఎడారిలో
చిన్ని చిన్ని చినుకులతో
జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా
మన్నుల్లో మొలకలన్నీ
మిన్ను చుట్టి రావాలని
రివ్వునా నింగికిలా ఎగిరేనయ్యా
మండేటి ఎండల్లో
పండు వెన్నెల కాయంగా
గుండెలకు పండగలే వచ్చినదయ్యా
అందనీ ఆకాశం దించావయ్యా మాకోసం
కాలాన నీ పేరు నిలిచేనయ్యా
కన్నులా ఎడారిలో
చిన్ని చిన్ని చినుకులతో
జల్లులే వచ్చి పల్లే మురిసిందయ్యా
చందమామ రావే అని
చిన్నారికి చూపే అమ్మ
అందుకొను రోజే ఎంతో
దూరం లేదు
నింగికి నిచ్చెన వేసే
ఆశే వచ్చే నీవల్ల
నువ్వెళ్లే దారుల్లో లేదిక ఎల్లా
నువ్వెళ్లే దారుల్లో లేదిక ఎల్లా
ముసి ముసి ముసలమ్మా
మొగ్గే వేసే అల్లరిలో
చిన్నారి పాపాయిలా మారెను నేడు
మేఘాల పల్లకిలో సాగాలనే ముచ్చటలో
నేలమ్మ అలగలాగా ఎగసేను చూడు
ఏ రారారే రా రారే
అరే రారా రా
ఏ రారారే రారే
రారా రారా రారే
తననే రారే అరే రారే రారే
తననే నానే రారే రారే