Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kalaganti And Mantalurepe
P. Susheela
,
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమీ
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
ఆకాశానికి అంతుందీ నా ఆవేదనకు అంతేదీ
ఆకాశానికి అంతుందీ నా ఆవేదనకు అంతేదీ
మేఘములోనా మెరుపుంది నా జీవితమందునా వెలుగేది
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
తీగలు తెగిన వీణియపై ఇక తీయని రాగం పలికేనా
తీగలు తెగిన వీణియపై ఇక తీయని రాగం పలికేనా
ఇసుక ఎడారిని ఎపుడైనా ఒక చిన్న గులాబి విరిసేనా
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
మదిలో శాంతిలేనపుడు ఈ మనిషిని దేవుడు చేసాడు
మదిలో శాంతిలేనపుడు ఈ మనిషిని దేవుడు చేసాడు
సుఖము శాంతి ఆనందం నా నొసటను వ్రాయుట మరిచాడు
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమీ
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
సాహిత్యం: దాశరథి