Ye Janmamo
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
ఆహహా లాలలా
లల లల లల లల లలలా
ఆహహా లాలలా
లల లల లల లల లా హా
ఏ జన్మదో ఈ సంబంధమూ ఏ రాగమో ఈ సంగీతమూ
మనసే కోరే మాంగల్యం తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధమూ
ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం
పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం
మా ఇంటిలోన పాదం పలికించె ప్రేమ వేదం
అందాల గుడిలోన పూజారినో ఓ బాటసారినో
ఏ జన్మదో ఈ సంబంధమూ
లతలు రెండూ విరులు ఆరై విరిసె బృందావనీ
కలలు పండీ వెలుగులాయే కలిసి ఉందామనీ
వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై.
హేమంత సిగ్గులొలికీ కవ్వింతలాయె కళకే
ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోటమాలిదో
ఏ జన్మదో ఈ సంబంధమూ ఏ రాగమో ఈ సంగీతమూ
మనసే కోరే మాంగల్యం తనువే పండే తాంబూలం
ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధమూ