Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Preminchi Pelli Chesuko
S. Rajeswara Rao
,
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఓ సోదర సోదరీమణులారా
ఆదరించి నా మాట వింటారా
వింటాం చెప్పు
ప్రేమించి పెళ్ళి చేసుకో
నీ మనసంతా హాయి నింపుకో
ప్రేమించి పెళ్ళి చేసుకో
వరుని వలపేమిటో, వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా
వరుని వలపేమిటో, వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా
తెలిసి కట్నాలకై బతుకు బలి చేసినా
కడకు మిగిలేది ఎడమోము పెడమోములే
ప్రేమించి పెళ్ళి చేసుకో
నీ మనసంతా హాయి నింపుకో
ప్రేమించి పెళ్ళి చేసుకో
మనిషి తెలియాలిలే, మనసు కలవాలిలే
మరచిపోలేని స్నేహాన కరగాలిలే
మనిషి తెలియాలిలే, మనసు కలవాలిలే
మరచిపోలేని స్నేహాన కరగాలిలే
మధుర ప్రణయాలు మనువుగా మారాలిలే
మారి నూరేళ్ళ పంటగా వెలగాలిలే
ప్రేమించి పెళ్ళి చేసుకో
నీ మనసంతా హాయి నింపుకో
ప్రేమించి పెళ్ళి చేసుకో
నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని
వలచి రుక్మిణియే పిలిపించె శ్రీకృష్ణుని
నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని
వలచి రుక్మిణియే పిలిపించె శ్రీకృష్ణుని
తొలుత మనసిచ్చి మనువాడె దుష్యంతుడు
పాత ఒరవళ్ళు దిద్దాలి మీరందరు
ప్రేమించి పెళ్ళి చేసుకో
నీ మనసంతా హాయి నింపుకో
ప్రేమించి పెళ్ళి చేసుకో