Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Lallaloy
Mickey J. Meyer
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కొక్కొరో రో తూతతూ తూతూ
లల్లలై లైలా మజ్నూ మనమేనంటూ ఫీలైపోదాం
లల్లలై LOVE మీనింగ్ ఏంటొ కనిపెడదాం
లల్లలై నువ్వు నేను ఇద్దరమంటే కాదని అందాం
లల్లలై నువ్వే నేనై నేనే నువ్వై కనపడదాం
మనం ఒకటైతే సరిపోదే మన నీడలనేం చేద్దాం
వాటిని పక్కన నిలిపి ఒకటిగ కలిపి ప్రేమని పేరెడదాం
లల్లలై లైలా మజ్నూ మనమేనంటూ ఫీలైపోదాం
లల్లలై LOVE మీనింగ్ ఏంటొ కనిపెడదాం
లల్లలై నువ్వు నేను ఇద్దరమంటే కాదని అందాం
లల్లలై నువ్వే నేనై నేనే నువ్వై కనపడదాం
నీ ఒంటి మీద చోటు చూసుకుంటా చిన్న పుట్టుమచ్చలాగ అంటుకుంటా
రోజుకొక్క మాటు నువ్వు నన్ను తానాల వేళలోన ముట్టుకుంటే చాలునంట
పచ్చబొట్టులాగ నేను మారిపోతా వెచ్చనైన ఛాతి పైన వాలిపోతా
లాలి పాడు గుండే లాయి లాయి లల్లాయి హాయిలొన చందనాలు చల్లుకుంటా
నీ నడువంపున మెలికై ఉంటా
నీ జడ పాయ నలుపైపోతా
నీ లోలాకు తళుకై ఉంటా
నీ చేతికున్న గాజునై గలగలమంటా
కొంటె దిగులంతా పలికిందా నీ వయసున గిలిగింతా
తీగలాగిందే నువ్వని తొణికిందేమో పెంచిన ప్రేమంతా
లల్లలై లైలా మజ్నూ మనమేనంటూ ఫీలైపోదాం
లల్లలై LOVE మీనింగ్ ఏంటొ కనిపెడదాం
లల్లలై నువ్వు నేను ఇద్దరమంటే కాదని అందాం
లల్లలై నువ్వే నేనై నేనే నువ్వై కనపడదాం
నువ్వు పిల్లిమొగ్గ వెయ్యమంటే రడీ ఎత్తు కొండలెక్కి దూకమంటె రడీ
కన్నె కంటి సైగ చెప్పినట్టు తూచాలు తప్పకుండా చేసుకుంటా ప్రేమ సందడీ
నువ్వు గాలి ముద్దు పెట్టుకుంటే రడీ తేనెవిందులోకి దించుకుంటే రడీ
నిన్ను రాసుకుంటూ పూసుకుంటూ రాగాలు తీసుకుంటూ పాడుకుంటా ప్రేమ మెలోడీ
నువ్వేదంటే అవునని అంటా
నీ పెదవంచు నవ్వై ఉంటా
నీ అరచేత పువ్వై ఉంటా
నా తూరుపెక్కడున్నదంటే నిన్ను చూపిస్తా
కట్టు తెర తీస్తా ఎదురొస్తా నువ్వు కోరిన అలుసిస్తా
అందుకే రేయీ పగలు రెప్పలు కాస్తూ నీ కోసం చూస్తా
లల్లలై లైలా మజ్నూ మనమేనంటూ ఫీలైపోదాం
లల్లలై LOVE మీనింగ్ ఏంటొ కనిపెడదాం
లల్లలై నువ్వు నేను ఇద్దరమంటే కాదని అందాం
లల్లలై నువ్వే నేనై నేనే నువ్వై కనపడదాం
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, గణేష్, మిక్కి జె. మేయర్,కృష్ణ చైతన్య, శ్వేతా పండిట్