Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kanapadaleda
Devi Sri Prasad
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష
(కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష)
గుండె నిండ పాలున్న బిడ్డల కందించలేని తల్లి బ్రతుకుదేనికని
బీళ్ళు నింపె నీళ్ళున్న సముద్రాన పడిపోయె శాపం తనకెందుకని
బరువై దయకరువై తనవెలుగె ఇక బలియై
(బరువై దయకరువై తనవెలుగె ఇక బలియై)
ఉప్పుసాగరాలలోకి వెళ్ళలేక వెళ్ళలేక
వెక్కివెక్కిపడుతున్నది ఉమాగ కనుమూయలేక
(వెక్కివెక్కిపడుతున్నది ఉమాగ కనుమూయలేక)
ఆ అలల అలజడి
ఆ తడి ఆరని కంటితడి
ఆ అలల అలజడి తడి ఆరని కంటితడి
కనబడలేదా వినబడటంలేదా
కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష
శిలా పలక లేసి మీరు ఎలా మరచిపోయారని
బాసరలో సరస్వతి పీఠమెక్కి అడిగినది
ధుర్మదాంధ్రులారా తెలుగు బిడ్డలకీ కర్మేందని
ధర్మపురిలో నారసింహ నాధం చేస్తున్నది
ఎడారులుగ మారుతున్న పొలాలను చూడలేక
కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది
పలుగు మోయలేని రైతు ఆత్మహత్యలను చలించి
భద్రాచల రాముడికి సాగిలపడి మొక్కినది
పాపి కొండల గుండె ధారై ప్రవహించినది
ధవళేశ్వకాటన్ మహాశైలి తలచినది
సిగ్గుపడండని కుటిల నాయకులని తిట్టినది
గుండె పగిలి నరసాపూర్ సముద్రాన దూకినది
కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష