Skip to content

Neelo Emundo

Ghantasala, Vijayakumar, Vidhya Suresh
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్ని కోరింది నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్ని ఇమ్మంది నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు ఆ ఆ నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు ఆ ఆ నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు నీ ఎదలో పూల పొదలే పూచి మధువులు చిందాయి నీ ఎదలో పూల పొదలే పూచి మధువులు చిందాయి నా మమతలు పెంచాయి నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్ని ఇమ్మంది నీ అల్లరి చూపులకే ఒళ్లంతా గిలిగింతా మ్మ్ నీ తుంటరి చేష్టలకే మదిలో పులకింత ఉహు నీ అల్లరి చూపులకే ఒళ్ళంతా గిలిగింత నీ తుంటరి చేష్టలకే మదిలో పులకింత నీ వంపులలోన సొంపులలోన వలుకును వయ్యారం నీ వంపులలోన సొంపులలోన వలుకును వయ్యారం అది వలపుల జలపాతం నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్ని కోరింది నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా ఓహో నీ పలుకులు వినకుంటే నిదురే రాదు కదా ఆహ నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా నీ పలుకులు వినకుంటే నిదురే రాదు కదా నీ సరసన లేని నిమిషం కూడ ఏదో వెలితి సుమా నీ సరసన లేని నిముషం కూడ ఏదో వెలితి సుమా ఇక నీవే నేను సుమా ఇక నీవే నేను సుమా నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్ని కోరింది నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్ని ఇమ్మంది