Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Peddi Reddy
Mamatha Ramesh
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో
ఓ రామ సిలుకా
గావురాలే నన్ను జేసి పెంచెనే
ఓ రామ సిలుకా
(పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో)
(ఓ రామ సిలుకా)
(గావురాలే నన్ను జేసి పెంచెనే)
(ఓ రామ సిలుకా)
కోరామీసాలు దువ్వుతూ మా నాయనా
కోరొక్క కూత పెడితేనే ఓ నాయనా
పెద్దాపులంత సప్పుడే మా నాయనా
తప్పే ఒప్పేసుకుంటరే
ఊరంతా పెద్దోడు నా ముందు
పసోడు పసోడు పసోడు
పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో
ఓ రామ సిలుకా
గావురాలే నన్ను జేసి పెంచెనే
ఓ రామ సిలుకా
పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో
ఓ రామ సిలుకా
గావురాలే నన్ను జేసి పెంచెనే
ఓ రామ సిలుకా
నేను పుట్టినప్పుడు మా నాయనా
నిండు అమాసనంటానే ఓ నాయనా
మా నాయనా మొఖం అప్పుడు
మా నాయనా పండు పున్నామంటనే
(ఓ నాయనా నేను పుట్టినప్పుడు మా నాయనా)
(నిండు అమాసనంటానే ఓ నాయనా)
(మా నాయనా మొఖం అప్పుడు)
(మా నాయనా పండు పున్నమంటనే)
(ఓ నాయనా)
మా నాయనా గుండె తొట్టేల జేసి
నన్ను ఊయల్లో ఊపేనంటనే
పేరుగల్లా పేరుగల్లా
(పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో)
(ఓ రామ సిలుకా)
(గావురాలే నన్ను జేసి పెంచెనే)
(ఓ రామ సిలుకా)
పట్టా గొలుసులు తెచ్చెనే ఓ నాయనా
పెట్టీ మురిసిపోయెనే మా నాయనా
పట్టూ లంగాలు తెచ్చెనే ఓ నాయనా
కట్టీ మురిసిపోయెనే (మా నాయనా)
(పట్టా గొలుసులు తెచ్చెనే ఓ నాయనా)
(పెట్టీ మురిసిపోయెనే మా నాయనా)
(పట్టూ లంగాలు తెచ్చెనే ఓ నాయనా)
(కట్టీ మురిసిపోయెనే మా నాయనా)
మారాణి నేనైతే గుర్రామే తానై
నా బారాలు అన్ని మోసెనే
పేరుగల్లా పేరుగల్లా
(పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో)
(ఓ రామ సిలుకా)
(గావురాలే నన్ను జేసి పెంచెనే)
(ఓ రామ సిలుకా)
ఏడూళ్లు చెప్పుకునేలా ఓ నాయనా
నా పెళ్లి చేసినాడులే మా నాయనా
కన్నీళ్లు దాచి గుండెల ఓ నాయనా
అక్షింతలేసినాడులే (మా నాయనా)
(ఏడు ఊళ్లు చెప్పుకునేలా ఓ నాయనా)
(నా పెళ్లి చేసినాడులే మా నాయనా)
(కన్నీళ్లు దాచి గుండెల ఓ నాయనా)
(అక్షింతలేసినాడులే మా నాయనా)
సిననాడు తన సంక దిగితే నేనేడ్సినట్టు
ఏడ్చుకుంటా నా చేతులిడిసినే
పేరుగల్లా పేరుగల్లా
(పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో)
(ఓ రామ సిలుకా)
(గావురాలే నన్ను జేసి పెంచెనే)
(ఓ రామ సిలుకా)
నేనూ లేని ఇంటిలో మా నాయనా
కునుకే లేక కంటిలో
పండుకుండే గాఢ నిద్రలో మా నాయనా
బాయిగడ్డ మీది మట్టిలో
కడుపారగన్నోడు నా కడుపులో పుడితే
పెట్టుకుంటి ఆయన పేరునే
పేరుగల్లా మా నాయనా
(పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో)
(ఓ రామ సిలుకా)
(గావురాలే నన్ను జేసి పెంచెనే)
(ఓ రామ సిలుకా)
(పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో)
(ఓ రామ సిలుకా)
(గావురాలే నన్ను జేసి పెంచెనే)
(ఓ రామ సిలుకా)