Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ammane Ayyanura Nee Rakatho
K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అమ్మనే అయ్యానురా నీ రాకతో
కమ్మనీ ఆనందమే నిండాలి నీతో
ఓ జాబిలి కూనా లాలిజో
నవ్వుల నానా లాలిజో
మా కలలకు రూపం కంటికి దీపం
ప్రేమకు ప్రతిరూపం
నిన్ను కన్న తల్లికి దక్కలేని భాగ్యమే
అమ్మా అనే మాటకి నేనే నోచకుంటిరా
మోసే బరువు లేకుండా పురిటి బాధ రాకుండా
నన్నే తల్లిని చేసావయ్యా ఇన్ని నాళ్లకి
కన్నది ఎవరైనా నీకున్నది ఈ అమ్మ
ఎన్నడు ఏమైనా నను వదలకురా నాన్న
చిగురు ఎరుగని తోటే చిగరించెనురా
చిరు చిరు నవ్వులకీ
కళ్లే మూసి వుంచినా కలలో నీవే నాయనా
గుండెలలోను ఊపిరిలోనూ ఉయ్యాల వూగగా
కన్నె పేగు దీవెన పెంచే ప్రేమ లాలనా
కాపాడాలే నిన్నే చిన్నా కంటికి రెప్పగా
ఎక్కడ నీ ఉన్నా నా ఆశలు నీవమ్మా
నీతో నీడల్లే నా ప్రాణం వుందమ్మా
నువ్వు ఇంతకు ఇంతై అంతకు అంతై ఎదగరా ఓనానా
అమ్మనే అయ్యానురా నీ రాకతో
కమ్మనీ ఆనందమే నిండాలి నీతో
ఓ జాబిలి కూనా లాలిజో
నవ్వుల నాన లాలిజో
మా కలలకురూపం కంటికిదీపం ప్రేమకుప్రతిరూపం