Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
My Dear Donga Title Song (From "My Dear Donga")
Ajay Arasada, Suresh Banisetti, Pranidhi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఏ దారి లేని ఏ చీకటో
కమ్మేసుకుంది ఏమిటో
నా చేతిలోన గీతేమిటో
కాస్తైన మారదేమిటో
నా గుండెలో బాధ మోసేదెలా
నా కళ్లలో వెల్లువాపేదెలా
నా దిగులు చూడలేక కాలం ఇలా
వెలితిలోన వెలుగు కొంత
పంపెనేమో నీలా
ఏదేదో కొత్త ఆశ
మేలుకున్నట్టుగానే ఉంది కొత్తగా
ఏదేదో కొత్త శ్వాస
అందినట్టే ఉంది వెచ్చగా
My dear దొంగ
ఆనందమంటే ఏంటో మరి
ఈ రోజు దాకా చూడలేదే
ఏ ఒక్కరైనా రారమ్మని
కాసింత ప్రేమ పంచలేదే
నీ పరిచయం కాస్త ఓదార్పుగా
ఓ మెరుపులా వచ్చి తాకిందిగా
ఎన్నాళ్లు ఉంటుందో ఈ హాయిలా
నేను కూడా చెప్పలేను
ఈ క్షణాల సాక్షిగా
ఏదేదో కొత్త ఆశ
మేలుకున్నట్టుగానే ఉంది కొద్దిగా
ఏదేదో కొత్త శ్వాస
అందినట్టే ఉంది వెచ్చగా
My dear దొంగా