Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Brathiki Chasthaava
King Johnson Victor
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా
ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా
బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా
ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా
చచ్చి బ్రతుకుతుంది ప్రతీ విత్తనం
చచ్చి బ్రతుకుతుంది ప్రతీ విత్తనం
నీవు విత్తినది చచ్చి బ్రతుకుచుండగా
నీవు విత్తినదే చచ్చి బ్రతుకుచుండగా
నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా
మరో బ్రతుకు లేదన్నది ఎవడురా
బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా
ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా
గొంగళి తన రూపం మార్చుకున్నది
సీతాకోక చిలుకగా ఎగురుచున్నది
గొంగళి తన రూపం మార్చుకున్నది
సీతాకోక చిలుకగా ఎగురుచున్నది
ఆ రూపము కొరకే దాచుకున్నది
ఆ రూపము కొరకే కలలుకన్నది
సృష్టిలో ప్రధముడా దేవుని కుమారుడా
సృష్టిలో ప్రధముడా దేవుని కుమారుడా
నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా
మరో బ్రతుకు లేదన్నది ఎవడురా
బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా
ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా
బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా
ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా
ప్రతీ చెట్టు పెరుగుచున్నది నీ కోసమే
ప్రతీ జీవి బ్రతుకుచున్నది నీ కోసమే
ప్రతీ చెట్టు పెరుగుచున్నది నీ కోసమే
ప్రతీ జీవి బ్రతుకుచున్నది నీ కోసమే
బ్రతికి బలౌతుంది నిన్ను బ్రతికించుట కొరకే
బ్రతకాలి నీవు దేవుని కొరకే
చావే ముగింపు కాదని ఆత్మకు చావు లేదని
చావే ముగింపు కాదని ఆత్మకు చావు లేదని
ప్రకటించి మరణించి తిరిగిలేచెను
సజీవుడైనాడు శకపురుష్యుడైన క్రీస్తుయేసు
బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా
ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా
బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా
ఇదే బ్రతుకు అనుకొని భ్రమపడుచున్నావా