Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nee Vanukunnadhi
P. Susheela
,
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నీ వనుకున్నది నే కలగన్నది ఓ చెలీ చెలీ నీ చిగురు పెదవిలో దాగున్నది
నీ వనుకున్నది నే కలగన్నది ఓ ప్రియా ప్రియా నీ చిలిపి చూపులో దాగున్నది
నీ అడుగుల జాడను నేనై.
ఆ ఆ ఆ ఆ
నా తోడు నీడవు నీవై.
ఆ ఆ ఆ ఆ
నీ అడుగుల జాడను నేనై నా తోడు నీడవు నీవై.
వికసించె నవ్వులమై విహరించె గువ్వలమై .
వికసించె నవ్వులమై విహరించె గువ్వలమై ఎగిరిఎగిరి పోదామా
ఊ ఊ
నీ వనుకున్నది నే కలగన్నది ఓ చెలీ చెలీ నీ చిగురు పెదవిలో దాగున్నది
నా జీవన వీణవు నీవై.
ఆ ఆ ఆ ఆ
నీ మోహన రాగము నేనై.
ఆ ఆ ఆ అ
నా జీవన వీణవు నీవై నీ మోహన రాగము నేనై.
పరువాలే సరిగమలై కోరికలే ఘుమ ఘుమలై.
పరువాలే సరిగమలై కోరికలే ఘుమ ఘుమలై పరిమళించిపోదామా
ఊ ఊహు
నీ వనుకున్నది నే కలగన్నది ఓ ప్రియా ప్రియా నీ చిలిపి చూపులో దాగున్నది
నా చలవల పందిరి నీవై.
ఆ ఆ ఆ
నీ వలపుల తీవెను నేనై.
ఆ ఆ ఆ ఆ
నా చలవల పందిరి నీవై నీ వలపుల తీవెను నేనై.
ప్రతి సుఖము చెరిసగమై బ్రతుకంతా ఒక క్షణమై.
ప్రతి సుఖము చెరిసగమై బ్రతుకంతా ఒక క్షణమై పరవశించిపోదామా
ఉహు ఉ
నీ వనుకున్నది నే కలగన్నది ఓ చెలీ చెలీ నీ చిగురు పెదవిలో దాగున్నది