Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Maa Palle
K. S. Chithra, S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మా పల్లే రేపల్లంట
ఈ పిల్లే రాధమ్మంట
రేగుతుంటే భోగి మంట
రేగుపండ్ల విందులంట
రేతిరంత కోడి పుంజు కొకొకో
మంచు పూల జల్లులంట
మంచ కాడ గిల్లుడంట
మంచ మేస్తే సంకురాత్రి తిరునాళ్ల
పల్లె పచ్చగా
పిల్ల వెచ్చగా ఉంటే పండగ
అరె మా పల్లే రేపల్లంట
ఈ పిల్లే రాధమ్మంట
వరినిచ్చే గ్రామ లక్ష్మి
వరమిచ్చే ప్రేమ లక్ష్మి
మురిసింది ముగ్గై తానే ముత్యాలమ్మ
బిడియాలే బిందెలైతే
కడియాలే ఘల్లు మంటే
తనవాడి గుండే కోరి దరువెయ్యంగా
పట్టుకుంటే మాసీ పోవు
పెట్టుకుంటే జారీ పోవు
కట్టు బొట్టు గుట్టు చూసి కట్టుకుంటా
ముట్టుకుంటే ముద్దకుంటూ
ముద్దబంతి పూల రెక్క
తేనె చుక్క విందు చేసి అల్లుకుంట
కోరి వచ్చిన గోరు వెచ్చని భామే పండగ
మా పల్లే రేపల్లంట
ఈ పిల్లే రాధమ్మంట
చెరుకుల్లో చేని కలిపి
ఇరుకుల్లో చేదు దులిపి
చికిలింత ముద్దే చిలిపిగ చిగురేయంగా
పలికింది పైటలమ్మ
కులికింది కూనలమ్మ
అలిగింది తనలో తానే అలివేనమ్మ
పోంగుతున్న సోకులన్నీ ఎంగిలైతే పొంగదంట
పాల బుగ్గ పాయసాల చిక్కనంట
కొండ మీది చందమామ
కొంగు పట్టు మేనమామ
ఒక్కడైతే చుక్కకెంత సందడంట
కోప మొచ్చినా తాప మొచ్చినా
ప్రేమే పండగ
మా పల్లే రేపల్లంట
ఈ పిల్లే రాధమ్మంట
రేగుతుంటే భోగి మంట
రేగుపండ్ల విందులంట
రేతిరంత కోడి పుంజు కొకొకో
మంచు పూల జల్లులంట
మంచ కాడ గిల్లుడంట
మంచ మేస్తే సంకురాత్రి తిరునాళ్ల
పల్లె పచ్చగా
పిల్ల వెచ్చగా ఉంటే పండగా హా హా
మా పల్లే రేపల్లంట ఏ ఏ ఏయ్
ఈ పిల్లే రాధమ్మంట ఆ
మా పల్లే రేపల్లంట ఆ హోయ్
ఈ పిల్లే రాధమ్మంట ఆ