Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nuvante Nakistamani
Rajesh & Usha
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగా
నీ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నువ్వు నా వెంట ఉంటే, అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కలా నిజమల్లే కనిపించదా
నిన్నిలా చూస్తూ ఉంటే, మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగా ఇలా నన్ను చేరగా
సుదూరాల తారక సమీపాన వాలగా
లేనే లేదు ఇంకే కోరిక
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
ఆగిపోవాలి కాలం, మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సనసన్నగా చేజారి పోనీయకా
చూడు నా ఇంద్రజాలం, వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా
నువ్వు నాకు తోడుగా, నేను నీకు నీడగా
ప్రతీ రేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగా
నీ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ