Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vennnela Pandhirilona
Bhanumathi Ramakrishna, P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఈ వెన్నెల మల్లి విరిపందిరిలోన
చిరునవ్వుల హారతి శేఖరుకీనా
వెన్నెల పందిరిలోన చిరునవ్వుల హారతులీన
పండు వెన్నెల మనసు నిండా వెన్నెల
కొండపైన కోనపైన కురిసే వెన్నెల
విరిసే వెన్నెల
మబ్బుల దారి ఓ బాటసారి
నీ ఒంటరి పయణం కాదా
నీ జంటగ నీ సఖి లేదా
నీ ఒంటరి పయణం కాదా
నీ జంటగ నీ సఖి లేదా
నాకై వేచె నవ్వులు పూచె నా చెలి కన్నుల కాచే వెన్నెల
పైన వెన్నెల మనసులోన వెన్నెల
పైన లోన చందమామ పరచే వెన్నెల
పాలవెన్నెల
చల్లని రేయి మెలమెల్లని గాలి
అలనల్లన మమతలు మూగే తియతీయని తలపులు రేగే
అలనల్లన మమతలు మూగే తియతీయని తలపులు రేగే
తీయని వలపులు తెచ్చేదెవరు నాకై పరుగున వచ్చేదెవరొ
పండు వెన్నెల మనసు నిండా వెన్నెల
కొండపైన కోనపైన కురిసే వెన్నెల
విరిసే వెన్నెల