Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Matanate
Ilaiyaraaja
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే
చుట్టుకోదా మంటా
దరికొస్తే ముప్పేకాదా తప్పుకోండి
తగుదూరం అంతా
నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే
చుట్టుకోదా మంటా
దరికొస్తే ముప్పేకాదా తప్పుకోండి
తగుదూరం అంతా
నియమాలే దాటలేను నిజమేది దాచలేను
నికరంగా నిష్టూరంగా డప్పుకొట్టి చెప్పిపోతా హా
నియమాలే దాటలేను నిజమేది దాచలేను
నికరంగా నిష్టూరంగా డప్పుకొట్టి చెప్పిపోతా
హాహా
నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే
చుట్టుకోదా మంటా
దరికొస్తే ముప్పుకాదా తప్పుకోండి
తగుదూరం అంతా
నమస్తే ముసలి మన్మధా
క్షమిస్తే హితవు చెప్పెదా
నరాల్లో పసరు చచ్చినా
బుసలు తగ్గలేదా
కులాసా ధీనబంధువా చరిత్రే చదవమందువా
ఒలిస్తే మేడిపండువే పైకి ఒప్పుకోవా
దివాకర నామధేయము
నిజాలే నాకు ద్యేయము
ప్రమాదం కలదు కాయము
పరిస్థితి బాహుబలియము
ఒప్పైన తప్పైనా ముప్పైనా తప్పెనా
కయ్యాలు వస్తాయి అంటారు
ఏం చెయ్యడం తగువు సహజం
నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే
చుట్టుకోదా మంటా
దరికొస్తే ముప్పేకాదా తప్పుకోండి
తగుదూరం అంతా
నియమాలే దాటలేను నిజమేది దాచలేను
నికరంగా నిష్టూరంగా డప్పుకొట్టి చెప్పిపోతా
హే హే
నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే
చుట్టుకోదా మంటా
దరికొస్తే ముప్పేకాదా తప్పుకోండి
తగుదూరం అంతా
నిజంగా ఒక్కటే నిజం
రహస్యం తెలిసె నీక్షణం
ప్రపంచం పరమ వికృతం
ముసుగు తీసి చూస్తే
అసత్యం సహజ సుందరం
అనంతం దాని వైభవం
అబద్దం కరిగిపోయెనా బ్రతుకు సాగదంతే
ప్రతీది పచ్చి బూటకం
నిజం ఒక నిత్యనాటకం
మనస్సు ఒకపాడు కీటకం
ఇదేరా అసలు కీలకం
వ్యాపారం వ్యవహారం సంసారం శృంగారం
అంగట్లో ముంగిట్లో అన్నిట్లో
అసత్యమే ఇనుప కవచం
నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే
చుట్టుకోదా మంటా
దరికొస్తే ముప్పేకాదా తప్పుకోండి
తగుదూరం అంతా
నియమాలే దాటలేను నిజమేది దాచలేను
నికరంగా నిష్టూరంగా డప్పుకొట్టి చెప్పిపోతా
హే హే
నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే
చుట్టుకోదా మంటా
దరికొస్తే ముప్పేకాదా తప్పుకోండి
తగుదూరం అంతా