Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Evaru Rayagalaru
Chakravarthy, K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎవరు రాయగలరూ
"అమ్మా" అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ
"అమ్మా" అను రాగం కన్న తీయని రాగం
అమ్మేగా
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు
"అమ్మా" అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు
"అమ్మా" అను రాగం కన్న తీయని రాగం
అవతారమూర్తి అయినా
అణువంటే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే
అంతవాడు అవుతాడు
అవతారమూర్తయినా అణువంటే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా, అమ్మేగా చిరునామా ఇంతటి ఘన చరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
ఎవరు రాయగలరు
"అమ్మా" అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు
"అమ్మా" అను రాగం కన్న తీయని రాగం
శ్రీరామ రక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
ధీర్ఘాయురస్థు అంటూ నిత్యం దీవించింది
శ్రీరామ రక్ష అంటు నీళ్ళుపోసి పెంచింది
ధీర్ఘాయురస్థు అంటు నిత్యం దీవించింది
నూరేళ్లూ, నూరేళ్లు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో
ఎవరు రాయగలరు "అమ్మా" అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు "అమ్మా" అను రాగం కన్న తీయని రాగం
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆది స్వరం ప్రాణమనె పాటకి
ఎవరు రాయగలరు "అమ్మా" అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు "అమ్మా" అను రాగం కన్న తీయని రాగం