Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ramakathanu Vinarayyaa
P. Susheela
,
P. Leela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
రామకథను వినరయ్యా రామకథను వినరయ్యా
ఇహపర సుఖముల నొసగే
సీతా రామకథను వినరయ్యా
అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు
ఆ రాజుకు రాణులు మువ్వురు
కౌసల్య సుమిత్ర కైకేయి
నోము ఫలములై వారికి కలిగిరి
కొమరులు నల్వురు
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ
రామకథను వినరయ్యా
ఇహపర సుఖముల నొసగే
సీతా రామకథను వినరయ్యా
గడియయేని రఘురాముని విడచి
గడుపలేని ఆభూజాని
కౌశిక యాగము కాచిరమ్మనీ
కౌశిక యాగము కాచిరమ్మనీ
పనిచెను నీరద శ్యామునీ
రామకథను వినరయ్యా
తాటకి దునిమి జన్నము గాచి
తపసుల దీవన తల దాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున
జనకుని యాగము చూచు నెపమ్మున
చనియెను మిథిలకు దాశరథీ
రామకథను వినరయ్యా
మదన కోటి సుకుమారుని కనుగొని
మిథిలకు మిథిలయె మురిసినదీ
ధరణిజ మదిలో మెరసిన మోదము ఆ
ధరణిజ మదిలో మెరసిన మోదము
కన్నుల వెన్నెల విరిసినదీ
రామకథను వినరయ్యా
హరుని విల్లు రఘునాథుడు చేకొని
ఎక్కిడ పెళ పెళ విరిగినదీ
కళకళలాడే సీతారాముల ఆ
కళకళలాడే సీతారాముల ఆ
కళకళలాడే సీతారాముల ఆ
కళకళలాడే సీతారాముల
కన్నులు కరములు కలసినవీ
రామకథను వినరయ్యా
ఇహపర సుఖముల నొసగే
సీతా రామకథను వినరయ్యా