Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kanthi Poola Pandaga
Vedala Hemachandra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ప్రేమ చిటికెలు వేసే క్షణం
ప్రతి గుండె గల గల కోలాహలం
హాయి పిలుపులు తాకే క్షణం
ప్రతి రోజు మిల మిల బృందావనం
చీకట్లనే వదిలించేయగా
సంతోషమే వెలుగై వాలగా
పెదవంచు ప్రమిదల్లో నవ్వు కిల కిల
కాంతి పూల పండగ
దీపావళి కంటి పాప నిండుగా
కాలమంత ఆగగా
ఆనంద కేళి గంతులేసి ఆడగా
తారజువ్వల్లాగా ఈ మనసు ఎగిరినీ వేళ
తారలు దివ్వెల్లాగా ధగ ధగ దారంత మెరిసెను చాలా
హే ఊహాలోనే ఉండిపోతే వెళ్ళిపోదా జీవితం
చేతులారా అందుకుంటే అంతులేని సంబరం
అరె ఏటు గాలి వీస్తుంటే అటు వైపుగా
వెళ్లి పోతే ఏముంది సరి కొత్తగా
అనుకున్న దారుల్లో అడుగేయగా
అసలైన గెలుపొచ్చి ముద్దాడదా
కాంతి పూల పండగ
దీపావళి కంటి పాప నిండుగా
కాలమంత ఆగగా
ఆనంద కేళి గంతులేసి ఆడగా
అనురాగం అల్లరి చేసే
అనుబంధం చిందులు వేసే
సరదాలకు తలుపులు తీసెయ్
నడిరేయికి రంగులు పూసే
పండగ పండగ పండగ పండగ దీపావళి పండగ
పండగ పండగ పండగ పండగ దీపావళి పండగ
హే చీకటేల దీపమల్లే వచ్చి పోవే వెన్నెల
తణుకులీలే సొగసుతోటి లాగుతావే నన్నిలా
నీలోని కలతలను చూడాలని
నీ చెంత చేరాను కావాలని
ఆ వెన్న ముద్దల్లే వెలగాలని
నీకిచ్చు కున్నాను నా మనసుని
హే కాంతి పూల పండగ
దీపావళి కంటి పాప నిండుగా
కాలమంత ఆగగా
ఆనంద కేళి గంతులేసి ఆడగా
నీ చుట్టూ భూ చక్రంలా తిరిగానే నిజమా కాదా
విరజిమ్మే నవ్వులు చూస్తే ఏద గూటికి పున్నమి రాదా
పండగ పండగ పండగ పండగ దీపావళి పండగ
పండగ పండగ పండగ పండగ దీపావళి పండగ