Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
oka lalana
Shankar Mahadevan, Sree Kalyanramana
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నిరిస నిరిపమా ఆ
ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటున
ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటున
తియ తీయని ప్రియ భావన
చిగురించదా పొరపాటున
కలబోసుకున్నా ఊసులు
ఏమైనవో అసలేమో
పెనవేసుకున్నా ప్రేమలు
మెలమెల్లగా ఎటుపోయెనో
ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటున
ఇంత కాలం దాచుకున్న
ప్రేమని హాయిని
కాలమేమీ దోచుకోదు ఇమ్మని
పెదవంచు మీద నవ్వుని
పూయించుకోడం నీ పని
నీ మౌనమే మాటాడితే
దరి చేరుకోదా ఆమని
ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటున
తియ తీయని ప్రియ భావన
చిగురించదా పొరపాటున
అందనంత దూరమేలే నింగికి నేలకి
వానజల్లే రాయబారం వాటికి
మనసుంటే మార్గం ఉండదా
ప్రతి మనిషి నీకే చెందడా
ఈ బంధమే ఆనందమే
నువు మోసుకెళ్లే సంపద
ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటున
తియ తీయని ప్రియ భావన
చిగురించదా పొరపాటున
కలబోసుకున్న ఊసులు
ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు
మెలమెల్లగా ఎటుపోయెనో
ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటున