Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Bapu Gari Bommo (From "Attarrintiki Daaredi")
Shankar Mahadevan
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హేయ్ బొంగరాలంటి కళ్లు తిప్పింది
ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పింది
అమ్మో బాపుగారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో
రబ్బరుగాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నెగరేసిందీ
అమ్మో దాని చూపు Gum-ఓ
ఓలమ్మో Old Monk Rum-ఓ హై
పగడాల పెదవుల్తో పడగొట్టింది
పిల్లా కత్తులులేని యుద్ధం చేసి
నన్నే గెలిచింది
ఏకంగా ఎదపైనే నర్తించింది
అబ్బా నాట్యంలోని ముద్దర చూసి
నిద్దర నాదే పోయింది
అమ్మో బాపుగారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో హో హో
మొన్న మేడమీద బట్టలారేస్తూ
కూనిరాగమేదో తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా
పల్లవి పాడిందే పిల్లా
నిన్న coffee glass-u చేతికందిస్తూ
నాజూకైన వేళ్లు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్ తీగై
ఒత్తిడి పెంచిందే మళ్లా హా హాయ్
హా హాయ్
కూరలో వేసే పోపు
నా ఊహల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది
పూలలో గుచ్చే దారం
నా గుండెల్లో గుచ్చేసింది
చీర చెంగు చివరంచుల్లో
నన్నే బంధీ చేసింది
పొద్దు పొద్దున్నే hello అంటుంది
పొద్దుపోతే చాలు కల్లోకొస్తుంది
పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది
అమ్మో బాపుగారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో
(सैयाँ आयी आयिए)
(माहिए आयी आयिए)
(रहिए आयी आयिए)
(అహ అహ అహ అహ)
(सैयाँ आयी आयिए)
(माहिए आयी आयिए)
(रहिए आयी आयिए)
(అహ అహ అహ అహ)
ఏ మాయా లోకంలోనో
నన్ను మెల్లగ తోసేసింది
తలుపులు మూసింది తాళం పోగెట్టేసింది
ఆ మబ్బుల అంచుల దాకా
నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది
తిన్నగా గుండెను పట్టి
గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలై
మళ్లీ ఊపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజకుమారి
ఆశలు రేపిన అందాల పోరి
పూసల దండలో నన్నే గుచ్చి
మెళ్లో వేసిందీ
అమ్మో బాపుగారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో ఓ ఓ