Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chukkala Thotalo
P. Susheela, S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లెపువ్వా
చక్కని జాబిలి ఎక్కడుంటాను
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను
నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల విరిసింది మల్లిక నా రాగ మాలిక
అల్లిబిల్లి నీ కౌగిట అల్లుకున్న నా మమత కొసరింది కోరిక అనురాగ గీతిక
నీ మూగ చూపులలో చెలరేగే పిలుపులలో
నీ పట్టు విడుపులలో సుడి రేగే వలపులలో
కన్ను కన్ను కలవాలి కలసి వెన్నెలై పోవాలి
చీకటి వెన్నెల నీడలలో దాగుడు మూతలు ఆడాలి
చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లెపువ్వా
చక్కని జాబిలి ఎక్కడుంటాను నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను
ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో
కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో
వేచి వున్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో
కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో
ఈ పూల వానలలో తడిసిన నీ అందాలు
ఆ... ఈ పూట సొగసులలో కురిసిన మకరందాలు
నీలో తీగలు మీటాలిNనాలో రాగం పలకాలి
లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలి
చుక్కల తోటలో ఎక్కడున్నావో
పక్కకు రావే మరుమల్లెపువ్వా
చక్కని జాబిలి ఎక్కడుంటాను
నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను