Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Amaraaraama
M. M. Keeravaani
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో
సాయినాథ నీ పావన మూర్తికి అభిషేకం క్షీరాభిషేకం
(అభిషేకం క్షీరాభిషేకం)
సురకల్పలతా సురభిడ సుమాల
సురు చిర సుమధుర మకరందంతో
సాయినాథ నీ మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం
(అభిషేకం మధురాభిషేకం)
మలయ మహీధర శిఖర వనాంతర
చందన సుఖ శీతల గంధంతో
సాయినాథ నీ సుందర మూర్తికి అభిషేకం చందనాభిషేకం
(అభిషేకం చందనాభిషేకం)
శ్రీహరి పద రాజీవ సముద్భవ గగన గంగ పావన శీకరముల
సాయినాథ నీ శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం
(సాయినాథ నీ శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం)
నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో
నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో
సాయినాథ నీ తేజోమూర్తికి అభిషేకం ఊద్యాభిషేకం
(సాయినాథ నీ తేజోమూర్తికి అభిషేకం ఊద్యాభిషేకం)
జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం
జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం
జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం