Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ole Ole Olammi
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఉఫ్ ఒలె ఒలె ఒలె ఓలమ్మీ ఉఫ్ అంటేనే ఉలిక్కిపడ్డావే
ఒళ్ళంతా నువ్వొంపులు తిరిగావే
ఒరె ఒరె ఒరె ఓరయ్యో ఉఫ్ అంటేనే ఉలిక్కిపడలేదు
నీ ఊపిరి తగిలి ఒంపులు తిరిగాను
ఒలె ఒలె ఒలె ఓలమ్మీ ఉఫ్ అంటేనే ఉలిక్కిపడ్డావే
ఒళ్ళంతా నువ్వొంపులు తిరిగావే
ఒరె ఒరె ఒరె ఓరయ్యో ఉఫ్ అంటేనే ఉలిక్కిపడలేదు
నీ ఊపిరి తగిలి ఒంపులు తిరిగాను
ఒంపు ఒంపులో ఉంది నన్ను చంపుకు తినేంత వయ్యారం
ఆ వయ్యారంలో ఉంది మళ్ళీ బతికించేంత సింగారం
ఒంపు వొంపులో ఉంది నన్ను చంపుకు తినేంత వయ్యారం
ఆ వయ్యారంలో ఉంది మళ్ళీ బతికించేంత సింగారం
నీ ఊపిరిలోనే ఉంది నన్ను ఉడికించేంత వెచ్చదనం అయ్యో
నీ ఊపిరిలోనే ఉంది నన్ను ఉడికించేంత వెచ్చదనం
ఆ వెచ్చదనంలో ఉంది ఉడుకును తగ్గించేంత చల్లదనం
ఒలె ఒలె ఒలె ఓలమ్మీ ఉఫ్ అంటేనే ఉలిక్కిపడ్డావే
ఒళ్ళంతా నువ్వొంపులు తిరిగావే
కొప్పు నున్నగా దువ్వి దాంట్లో గొబ్బి పువ్వునే తురిమావు
ఆ గొబ్బి పూల సందిట్లో నేను గండు తుమ్మెదై తిరిగాను
కొప్పు నున్నగా దువ్వి దాంట్లో గొబ్బి పువ్వునే తురిమావు
ఆ గొబ్బి పూల సందిట్లో నేను గండు తుమ్మెదై తిరిగాను
తిరిగి తిరిగి రేపెట్టి నువు పొలము దున్నుతూ ఉంటావూ
తిరిగి తిరిగి రేపెట్టి నువు పొలము దున్నుతూ ఉంటావూ
అది తలుచుకుంటూ నేనింట్లో రాతిరి ఎప్పుడెప్పుడని ఉంటాను
ఒరె ఒరె ఒరె ఓరయ్యో ఉఫ్ అంటేనే ఉలిక్కిపడలేదు మరి
నీ ఊపిరి తగిలి ఒంపులు తిరిగాను
చెంగు చుట్టగా చుట్టి చేత్తో గంపను పట్టుకు నడిచేవు
ఆ గుట్టుగా ఉన్న అందాలు నువ్వే రట్టు చేసుకుంటున్నావు
పట్టపగలే గుట్టంతా అయినా నీకూ నాకూ తెలియనిదా
రట్టు గాని కాపురము వెయ్యి పుట్టుకలైనా కోరే వరము
ఒలె ఒలె ఒలె ఓలమ్మీ ఉఫ్ అంటేనే ఉలిక్కిపడ్డావే
ఒళ్ళంతా నువ్వొంపులు తిరిగావే
ఒరె ఒరె ఒరె ఓరయ్యో ఉఫ్ అంటేనే ఉలిక్కిపడలేదు
నీ ఊపిరి తగిలి ఒంపులు తిరిగాను