Skip to content

Nee Jathaga

Karthik; Shreya Ghoshal
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి నాకే తెలియని నను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నను రప్పించావే నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వనిపించావే నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా రాలేదే జాడైనా లేదే రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే పైగా తిడతావే లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావ నన్నిలా నీలోకం నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి తెలిసీ తెలియక వాలింది నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపు ఏం చేస్తాం చెప్పు తోచని తొందర పుడుతోంది తెగ తుంటరిగా నను నెడుతుంది నీవైపు నీదే ఆ తప్పు నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి