Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Oorike Undade
K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే అసలేమైందో నాకు
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే అసలేమైందో నాకు
ఏనాడో ఇది తప్పదే అనుకుంటూనే ఉన్నా
ఈనాడే ఇలా ఎదురై ఏదో అయిపోతున్నా
ఔననా కాదనా అతనేదో అన్నాడు
ఆగనా సాగనా అంటోంది నా ఈడు
రోజూ అలవాటైనా తనకేసి చూడాలంటే
మరి ఈరోజేమో బిడియంగా ఉందమ్మా
ఇన్నాళ్ళూ ఎప్పుడైనా
ఈ సిగ్గులు తెలిసొచ్చేనా
తన చూపుల్లో ఏదో మాయుందమ్మా
అడుగుల అలికిడి వింటే
ఎందుకు అలజడి అంటే
ఏం చెప్పేదమ్మా
నిలువునా గిలిగింతలు రేపాడే
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే అసలేమైందో నాకు
ఛి ఛి పోవే పైట నీకేమోచ్చిందీ పూట
ఈ బరువంతా ఇన్నాళ్ళేమైందంటా
ఏదో ఆరాటంతో ఎద కంగారవుతూ ఉంటే
ఇది హాయో కాదో చెప్పే వాళ్ళెవరంటా
తానే కనబడకుంటే ప్రాణం నిలబడదంటూ
ఒట్టేసి మరీ అతనికి చెప్పాలనిపిస్తోంది
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే ఏదో అయిపోతుందా
ఊరికే ఉండదే ఉయ్యాలూగే మనసు
ఊహకే అందదే అసలేమైందో నాకు