Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sirimalle Neeve
Rajan-Nagendra, S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
ఎలదేటి పాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లే
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే
నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే... వనదేవతల్లే
పున్నాగపూలే... సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే... ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకు వేసే నీ రాకతోనే
నీ పలుకు పాటై బ్రతుకైన వేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే
నా బ్రతుకు నీవే
అనురాగమల్లే... సుమగీతమల్లే
నన్నల్లుకోవే... నా ఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే... ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే