Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yemcheddam
Ranjith; Sri Rama Chandra; Karthik
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ
అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
ఏదో తలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం
దేన్నో వెతకడం ఎన్నో అడగడం ఎపుడు తెమలని రాద్దాంతం
ఏం చేద్దాం, అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం, మునుమున్దేముందో తెలియని చిత్రం
ఏమందాం, మననేవరడిగారని ఏమని అందాం
ఏం విందాం, తక తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ
అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
Follow, పదుగురి బాట
बोलो, నలుగురి మాట
లోలో, కలవరపాట
దాంతో, గడవదు పూట
ఇటా ఆటా అని ప్రతోక్క దారిని నిలేసి అడగకు సహోదరా
ఇదే ఇదే అని ప్రమానపూర్తిగా తెగేసి చెప్పెదెలాగరా
ఇది గ్రహించిన ఈ మహాజనం ప్రయాస పడి మరి ఎం ప్రయోజనం
Cement భూతాల సహారా దారిది నిలవడం కుదరదే కదలరా
ఏం చేద్దాం, అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం, మునుమున్దేముందో తెలియని చిత్రం
ఏమందాం, మననేవరడిగారని ఏమని అందాం
ఏం విందాం, తక తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్
ఎన్నో పనులను చేస్తాం
ఏవో పరుగులు తీస్తాం
సతమతమవుతాం
ఓహొ బ్రతుకిదే అంటాం
అటంకు తెలియని ప్రయాణమే యుగయుగాలుగా మన అయోమయం
వెనక్కు తిరగని ప్రవాహమే ఏ తుఫాను తరిమిన ప్రతిక్షణం
ఇది పుటుక్కు జరజర డుబుక్కుమే అడక్కు అది ఒక రహస్యమే
ఫలానా బదులని తెలీని ప్రశ్నలు అడగడం తగదుగా