Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Oorike Kolanu Neeru
P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది
ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది
ఎందుకో ఎందుకో ప్రతి పులుఁగు యేదో చెప్పబోతుంది
వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది
ఉండుండీ నా ఒళ్ళు ఊగి ఊగి పోతుంది
అదిగో రామయ్య ఆ అడుగులు నా తండ్రివి
ఇదుగో శబరీ శబరీ వస్తున్నానంటున్నవి
కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని
నా కోసమే నా కోసమే నడచి నడచి నడచి నా కన్నా నిరుపేద నా మహరాజు పాపం అదుగో
అసలే ఆనదు చూపు ఆ పై ఈ కన్నీరు తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో
ఏలాగో నా రామా ఏదీ ఏదీ ఏదీ నీల మేఘమోహనము నీ మంగళ రూపము
కొలను నడిగి తేటనీరు కొమ్మ నడగి పూల తేరు
గట్టు నడిగి చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు.
పుట్ట తేనె రసాలు
దోరవేవో కాయలేవో ఆరముగ్గినవేవో గాని ముందుగా రవ్వంత చూసి విందుగా అందీయనా
విందుగా అందీయనా
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి