Skip to content

Mana Suna Manasai

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

మనసున మనసై బ్రతుకున బ్రతుకై మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము చెలిమియె కరువై వలపే అరుదై చెదరిన హృదయమే శిలయైపోగా నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము