Skip to content

Kannirelamma

Blessie Wesly
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

కన్నీరేలమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాన్పె కరుణ చూపి కలత మాన్పె యేసే తోడమ్మా కన్నీరేలమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమాన పరిచారా తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా చింతించకన్న యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా చింతించకన్న యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా కన్నీరేలమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా కన్నీరేలమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కన్నీరేలమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా... కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా