Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Raarandoi Veduka Chuddam
Ranjith
,
Gopika Poornima
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ
కంటి నిండ ఆశలతో మా సీతమ్మ
తాళి బొట్టు చేత బట్టి రామయ్య రామయ్య
సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య
పెద్దలు వేసిన అక్షింతలు
దేవుడు పంపిన దీవెనలు
దివిలో కుదిరిన దంపతులు
ఈ చోట కలిశారు ఇవ్వాల్టికి
ఆటలు పాటలు వేడుకలు
మాటకు మాటలు అల్లరులు
తియ్యని గుర్తుల కానుకలు
వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి
రారండోయ్ వేడుక చూద్దాం
ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగ చేసేద్దాం
ఆడేద్దాం, పాడేద్దాం, నవ్వేద్దాం, నవ్వేద్దాం
వారు వీరనే తేడా లేదులే
ఇకపై ఒక్కటే పరివారం
పేరు పేరునా పిలిచే వరసలై
ఎదిగే ప్రేమలే గుణకారం
ఇద్దరి కూడిక కాదు ఇది
వందల మనసుల కలయికిది
ఈ సుముహూర్తమే వారధిగా
భూగోళమే చిన్నదవుతున్నది
రారండోయ్ వేడుక చూద్దాం
వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందాం
ఆడేద్దాం, పాడేద్దాం, నవ్వేద్దాం, నవ్వేద్దాం
కాలం కొమ్మపై మెరిసే నవ్వులై
కలిసే గువ్వలే బంధువులు
కదిలే దారిలో మెదిలే గుర్తులై
నడిపే దివ్వెలే వేడుకలు
ఎపుడో తెలిసిన చుట్టాలు
ఇపుడే కలిసిన స్నేహితులు
మనసుని తడిమిన సంగతులు
కనువిందుగా ఉంది ఈ పందిరి
రారండోయ్ వేడుక చూద్దాం
ఆయనవాళ్ళందరం ఈ వెళిలా ఒక్కటిగా చేరాం
ఆడేద్దాం, పాడేద్దాం, నవ్వేద్దాం, నవ్వేద్దాం