Skip to content

Chilakapaccha Thotalo

K. V. Mahadevan, K. S. Chithra, S.P. Balasubrahmanyam
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు నవ్వుల అవి కావు నవ్వుల అవి కావు నవ పారిజాతాలు నవ్వుల అవి కావు నవ పారిజాతాలు రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు ఆ రాజు ఈ రోజు అరుదెంచునా ఆ రాజు ఈ రోజు అరుదెంచునా అపరంజి కలలన్ని చిగురించునా తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను పాటలాధర రాగ భావనలు కన్నాను చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను పాటలాధర రాగ భావనలు కన్నాను ఎల నాగ నయనాల కమలాలలో దాగి ఎల నాగ నయనాల కమలాలలో దాగి ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను ఆ పాట నాలో తీయ్యగ మ్రోగనీ ఆ పాట నాలో తీయ్యగ మ్రోగనీ అనురాగ మధుధారయై సాగనీ తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు