Niluvave Vaalu Kanula Dhaana
T.Chalapathi Rao
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె చానా
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే నిలువదె నా మనసు
ఓ లలనా అది నీకే తెలుసు
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె చానా
ఎవరని యెంచుకోనినావో పరుడని భ్రాంతి పడినావో
ఎవరని యెంచుకోనినావో, భ్రాంతి పడినావో, సిగ్గుపడి తొలగేవో
విరహాగ్నిలో నన్ను తోసి పోయేవో
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే నిలువదె నా మనసు
ఓ లలనా అది నీకే తెలుసు
ఒకసారి నన్నుచూడరాదా చెంతచేర సమయం ఇదికాదా
ఒకసారి నన్నుచూడరాదా, సమయం ఇదికాదా, చాలునీ మర్యాద
వగలాడినే నీ వాడనేకాదా
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు
ఓ లలనా అది నీకే తెలుసు
మగడంటే మోజులేనిదానా మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజులేనిదానా, నీకు నేను లేనా, కోపమా నా పైనా
నీ నోటిమాటకె నోచుకోలేనా
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె చానా
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే నిలువదె నా మనసు
ఓ లలన, ఓ చెలియా, ఓ మగువా అది నీకే తెలుసు