Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Evaraina Chustuntara
Smita
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్నా రైతునై
చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజు నేనై
కోటిగుండెల కోటల్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్ని వీణ తీగలై
స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంతే
అది నిజమోకాదో తేలాలంటే
చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
చంద్రుడికి మన భాషే నేర్పిస్తా
తెలుగు కథ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో
ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడేవరంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడా తలవంచేలా
మన జెండా ఎగరాలీవేళ
చుక్కల్ని తాకేంతల
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్నా రైతునై
చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజు నేనై
కోటి గుండెల కోటల్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని